జగ్గారెడ్డితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ

ABN , First Publish Date - 2022-02-20T02:54:11+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు.

జగ్గారెడ్డితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ

హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంటికి జగ్గారెడ్డిని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీసుకొచ్చారు. జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గారెడ్డి పార్టీని విడద్దంటూ ఉత్తమ్, గీతారెడ్డి బుజ్జగిస్తున్నారు. సమస్యలుంటే ఢిల్లీలో తేల్చుకుందామని సూచించినట్లు సమాచారం. అధినేత రాహుల్ గాంధీని కలిసి జరుగుతున్న వ్యవహారాలను, తనకు జరిగిన అవమానాలను వివరించాలని జగ్గారెడ్డికి ఉత్తమ్ సూచించారు. పార్టీని వీడతానని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగ్గారెడ్డికి నేతలు సూచించారు.

Read more