సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-12-07T23:46:25+05:30 IST
ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంకోసం సామాజిక మాధ్యమ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. బుధవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ‘సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం-ఇమ్యూనైజేషన్ సేవల బలోపేతం’పై నిర్వహించిన కమ్యూనికేషన్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు.
ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా
బీబీనగర్, డిసెంబరు 7: ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంకోసం సామాజిక మాధ్యమ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. బుధవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ‘సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం-ఇమ్యూనైజేషన్ సేవల బలోపేతం’పై నిర్వహించిన కమ్యూనికేషన్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో ప్రజలకు అర్థమయ్యేలా సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, ఇన్చార్జీ డీన్ నితిన్ జాన్, ప్రొఫెసర్ రష్మి కుందాపూర్, ఐటీ నిపుణులు పాల్గొన్నారు.