వెన్నునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-31T00:36:51+05:30 IST

వెన్నునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

వెన్నునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

బొమ్మలరామరం, డిసెంబరు 30: వెన్నునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రాఘవేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లికి చెందిన సత్తెమ్మగారి లత (38) ఆరు నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతోంది. ఈ బాధను తట్టుకోలేక శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో సీలింగ్‌ఫ్యానకు ఉరేసుకొని బలవర్మణానికి యత్నించింది. స్థానికులు చూసి భర్త వెంకట్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది. లతకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత తల్లి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-31T00:36:51+05:30 IST

Read more