HYD: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి
ABN , First Publish Date - 2022-04-27T13:42:34+05:30 IST
నగరంలోని గోల్కొండ బడబజార్లో దారుణం జరిగింది.
హైదరాబాద్: నగరంలోని గోల్కొండ బడబజార్లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.