లోకం తీరు

ABN , First Publish Date - 2022-01-09T09:12:39+05:30 IST

లోకం తీరు

లోకం తీరు

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల పోస్టింగుల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. మరో 14 వేల మంది ఉద్యోగులకు పోస్టింగు ఆర్డర్లు జారీ చేశారు. వీరంతా మూడు రోజుల్లోగా విధుల్లో చేరాలంటూ ఉద్యోగులను అధికారులు ఆదేశించారు. దీంతో రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్‌ శాఖల్లోనూ పోస్టింగుల ప్రక్రియ పరిపూర్ణమైంది. శుక్రవారం నాటికి అన్ని శాఖల్లో ఒకటి అర తప్ప జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల పోస్టింగుల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. కానీ రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్‌ శాఖల్లో కొంత మందికి పోస్టింగులు ఇవ్వలేదు. ఇలాంటి వారి కేసులను శనివారం పరిష్కరించి పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు ఐఎ్‌ఫఎంఐఎస్‌ పోర్టల్‌ నుంచి పోస్టింగ్‌ ఆర్డర్లు జనరేట్‌ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు 30 వేలకు పైగా పోస్టింగులు ఇచ్చినట్లయింది. 

Updated Date - 2022-01-09T09:12:39+05:30 IST