TS News: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-09-25T01:57:54+05:30 IST

Hyderabad: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు.. పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని ఆయన పేర్కొన్నా

TS News: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Hyderabad: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు.. పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దాదాపు రూ. 350 కోట్లతో కోటి మంది ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని చెప్పారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేసిందన్నారు. 

Read more