వర్సిటీ పేరు మార్పు కరెక్ట్‌ కాదు: వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2022-09-23T08:39:34+05:30 IST

వర్సిటీ పేరు మార్పు కరెక్ట్‌ కాదు: వైఎస్ షర్మిల

వర్సిటీ పేరు మార్పు కరెక్ట్‌ కాదు: వైఎస్ షర్మిల

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం కరెక్ట్‌ కాదని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం పాదయాత్రలో ఉన్న షర్మిల హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. పేరు మార్చడం వల్ల యూనివర్సిటీ ప్రాధాన్యత పోతుందన్నారు. ఏవో కారణాల చేత యూనివర్సిటీకి ఒక పేరు పెట్టారని, ఆ పేరును అలాగే కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కోపేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏది రెఫర్‌ చేస్తున్నారో తెలియక ప్రజల్లో ఆయోమయం నెలకొంటుందని వైఎస్‌ షర్మిల చెప్పారు.

Updated Date - 2022-09-23T08:39:34+05:30 IST