8 గుర్తులపై హైకోర్టును ఆశ్రయించనున్న టీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2022-10-17T09:29:27+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తుల విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది.
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తుల విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఆ గుర్తులను తొలగించాలని టీఆర్‌ఎస్ ప్రతినిధులు ఇటీవలే ఎన్నికల ప్రధాన అధికారికి వినతిపత్రం ఇచ్చారు. పలు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కారును పోలిన కెమెరా, చపాతీ మేకర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు, డబ్బా, టీవీ, కుట్టుమెషిన్, ఓడ గుర్తులను కేటాయించడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురై, టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని సీఈవోకు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో వాటిని ఎవరికీ కేటాయించవద్దని కోరారు. అయితే ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టీఆర్‌ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.