తుక్కు తుక్కుగా కొడతాం కొడకా..: ఎంపీ కవిత

ABN , First Publish Date - 2022-02-23T21:50:02+05:30 IST

కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డిపై మహబూబాబాద్ ఎంపీ

తుక్కు తుక్కుగా కొడతాం కొడకా..: ఎంపీ కవిత

మహబూబాబాద్: కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డిపై మహబూబాబాద్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు  చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో చేపట్టిన ఉక్కు దీక్షలో ఎంపీ మాట్లాడారు. తాము ( టీఆర్‌ఎస్ నేతలు) చేతగాని దద్దమ్మలం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారన్నారు. బయ్యారం ఉక్కును తుక్కుతో పోల్చారని ఆమె ఆరోపించారు. " మిమ్మల్నే తుక్కు తుక్కుగా కొడతాం కొడకా" అని కిషన్ రెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంత హక్కుల కోసం ప్రాణాలైనా తెగిస్తామని ఆమె స్పష్టం చేశారు. 

Read more