గౌడ కులస్తులకు అరవింద్ క్షమాపణలు చెప్పాలి: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-22T17:23:51+05:30 IST

బీజేపీకి కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ స్పష్టమైన సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

గౌడ కులస్తులకు అరవింద్ క్షమాపణలు చెప్పాలి: జీవన్ రెడ్డి

హైదరాబాద్: బీజేపీకి కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ స్పష్టమైన సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ సవాల్‌కు సమాధానమివ్వకుండా బీజేపీ ఎంపీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంజయ్.. అరవింద్ హెయిర్ లెస్ హెడ్ లెస్ ఎంపీలుగా మారారని యెద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు చిచోరా, చిల్లర గాళ్లుగా మారిపోయారన్నారు. బీజేపీ ఎంపీలు కేడీ నెంబర్ వన్‌లుగా మారితే రేవంత్ జైలు కెళ్ళి బేడీ నెంబర్ వన్ ఎంపీగా మారారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పులి లాంటోడు.. అరవింద్, రేవంత్‌లు ఊరకుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. ధర్మపురి అరవింద్ కాదు ధగుల్భాజి అరవింద్ డెకాయిట్ అని అన్నారు.


ఎల్లమ్మ తల్లికి కుడి చెప్పు ముడుపు కట్టావా అని అరవింద్.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలతో హిందువులను అవమానపరిచారన్నారు. తక్షణమే అరవింద్ గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అరవింద్ మీ తరుణ్ చుగ్ వెంట్రుకలు తెచ్చి పెట్టుకో.. అరవింద్ నాపై దమ్ముంటే పోటీకి రా..అని ఎపుడో చెప్పా.. మళ్లీ చెబుతున్నా. రేవంత్... చంద్రబాబు చెప్పులు మోసినోడు ఆయనకు చప్రాసీగా పని చేసినోడు.. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంబోతు రేవంత్ రెడ్డి, అవినీతి రేవంత్ రెడ్డి. బీజేపీ పేదలపై బుల్ డోజర్‌లు ప్రయోగిస్తే మేము బీజేపీపై రాజకీయ బుల్డోజర్ ప్రయోగించి అంతం చేస్తాం. రోజూ హిందువునని చెప్పుకునే అరవింద్ దేవుళ్ళని అవమాన పరుస్తాడా. రేవంత్ లాంటి ఓటుకు నోటు గజదొంగకు పీసీసీ పదవి ఇచ్చి సోనియా తెలంగాణలో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు’’ అంటూ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


Updated Date - 2022-04-22T17:23:51+05:30 IST