21న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం
ABN , First Publish Date - 2022-03-19T23:05:40+05:30 IST
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు జరపాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు జరపాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. శాసనసభ పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.