HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

ABN , First Publish Date - 2022-04-18T20:10:32+05:30 IST

నగరంలోని HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.

HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

హైదరాబాద్: నగరంలోని  HICCలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు.  ప్లీనరీ సభ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలను కేటీఆర్  వేశారు.  ఈ కమిటీలకు సంబంధించి ఆహ్వాన, అలంకరణ, సభా ప్రాంగణ, భోజన,  తీర్మానాల, మీడియా కమిటీలను కేటీఆర్ ప్రకటించారు.  మున్సిపల్,  పోలీసు శాఖలతోనూ కేటీఆర్ సమన్వయ సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు, తలసాని, మల్లారెడ్డి, సబితారెడ్డి, రంజిత్‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, వివేక్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-18T20:10:32+05:30 IST