టీఆర్ఎస్‌లో సెగలు రేపుతోన్న వర్గపోరు

ABN , First Publish Date - 2022-05-01T02:55:12+05:30 IST

జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల మధ్య వర్గపోరు సెగలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

టీఆర్ఎస్‌లో సెగలు రేపుతోన్న వర్గపోరు

నల్గొండ: జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల మధ్య వర్గపోరు సెగలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. శనివారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒక్కసారిగా  భగ్గుమన్నారు. హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఒకరిపై ఒకరుదాడులు చేసుకుంటూనే మరో వైపు విమర్శనాస్త్రాలు సంధించుకునే వరకు ఈ ఘటన రాజుకుంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిల మధ్య విభేదాలు భయటపడ్డాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి.

Updated Date - 2022-05-01T02:55:12+05:30 IST