నేటి నుంచి రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు
ABN , First Publish Date - 2022-10-18T05:13:44+05:30 IST
నేటి నుంచి రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు
ఏటూరునాగారం రూరల్, అక్టోబరు 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహల్లోని అండర్-14, 17 పోటీలను ములుగు జిల్లా ఏటూరునాగారంలో నిర్వ హించనున్నారు. మంగళవారం నుంచి ఏటూరునా గారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇవి ప్రారంభం కానున్నా యి. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ క్రీడా పోటీల కోసం ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఆకులవారిఘణపురంలో ఉన్న కుమ్రంభీం మినీ స్టేడియాన్ని నిర్వాహకులు సిద్ధం చేశారు. ఆరు జోన్లు జరిగే ఈ పోటీల్లో మొత్తం 1,660 మంది క్రీడా కారులు పాల్గొంటారు. ఏటూరునాగారం-1, భద్రాచలం-1, ఉట్నూర్ జోన్-1, 2 జోన్లుగా, మైదాన ప్రాంతాలను రెండు జోన్లుగా విభజించి పోటీలను నిర్వహించనున్నారు. వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, ఆర్చరీ, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, చెస్, క్యారం తదితర అంశాల్లో క్రీడలు జరగనున్నాయి. క్రీడాకారులకు వసతి ఏర్పాట్లతో పాటు పౌష్టికాహారం అందించనున్నట్టు ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు.