బీఆర్ఎస్తో బీజేపీ, కాంగ్రెస్‌లో ప్రకంపనలు
ABN , First Publish Date - 2022-10-07T09:03:12+05:30 IST
బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
ఆ పార్టీల స్పందనే దీనికి నిదర్శనం: మంత్రి జగదీశ్ రెడ్డి
ఏపీలోనూ బీఆర్‌ఎ్‌సను విస్తరిస్తాం: మంత్రి పువ్వాడ
నవశకానికి నాంది: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నల్లగొండ, ఖమ్మం, అక్టోబరు 6: బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్, బీజేపీలు స్పందించిన తీరే ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రగతిశీల పార్టీలతో కలిసి బీజేపీపై పోరు కొనసాగిస్తామని, అందుకు వామపక్షాలు కలిసి రావడం అభినందనీయమన్నారు. ఏపీలోనూ బీఆర్‌ఎ్‌సను విస్తరిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దేశానికి కేసీఆర్ నాయత్వం అవసరం ఉందని, అందుకే బీఆర్‌ఎ్‌సను స్థాపించారని టీఆర్ ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు దేశరాజకీయాల్లో నవశకానికి నాంది అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.