జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌గా టీఎన్‌ఎస్‌ ప్రసాద్‌

ABN , First Publish Date - 2022-10-17T06:00:37+05:30 IST

జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌గా టీఎన్‌ఎస్‌ ప్రసాద్‌

జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌గా టీఎన్‌ఎస్‌ ప్రసాద్‌

వరంగల్‌ సిటీ, అక్టోబరు 16: వరంగల్‌ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌గా టీఎన్‌ఎస్‌ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. గతంలో జిల్లా మేనేజర్‌గా పనిచేసిన ఇర్ఫాన్‌ ప్రభుత్వం అనుమతి లేకుండా రైస్‌మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ అక్రమంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిందే. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి మాడూరి గౌరీశంకర్‌కు జిల్లా మేనేజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, బదిలీపై జిల్లాకు రానున్న ప్రసాద్‌ ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-10-17T06:00:37+05:30 IST