తెలంగాణ ఆగ్రో ఇండసీ్ట్రస్‌ అభివృద్ధి చైర్మనగా తిప్పన

ABN , First Publish Date - 2022-12-01T01:14:26+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండసీ్ట్రస్‌ అభివృద్ధి చైర్మనగా మి ర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి నియమితులయ్యారు.

 తెలంగాణ ఆగ్రో ఇండసీ్ట్రస్‌ అభివృద్ధి చైర్మనగా తిప్పన
విజయసింహారెడ్డికి నియామకపత్రాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌

తెలంగాణ ఆగ్రో ఇండసీ్ట్రస్‌ అభివృద్ధి చైర్మనగా తిప్పన

మిర్యాలగూడ, మిర్యాలగూడరూరల్‌, నవంబరు 30: తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండసీ్ట్రస్‌ అభివృద్ధి చైర్మనగా మి ర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ సోమే్‌షకుమా ర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మిర్యాలగూడ మండల పరిధిలోని సుబ్బారెడ్డిగూడెంనకు చెందిన విజయసింహారెడ్డి రాజకీయ కుటుంబంలో జన్మించారు. తండ్రి తిప్పన కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిప్పన విజయసింహారెడ్డి సైతం 1989-1994 కాలంలో కాంగ్రెస్‌ పార్టీ మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాలంలో రాష్ట్ర రోడ్డు రవాణా సం స్థ చైర్మనగా కూడా ఆయన పనిచేశారు. టీఆర్‌ఎస్‌ ఏర్పాటైన తొలినాళ్లలోనే పార్టీలో చేరి టీఆర్‌ఎస్‌ బలోపేతం కోసం ఆయ న పనిచేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి నల్లగొండ జి ల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.

Updated Date - 2022-12-01T01:14:28+05:30 IST