పాకాలలో పులి సంచారం

ABN , First Publish Date - 2022-02-23T06:08:50+05:30 IST

పాకాలలో పులి సంచారం

పాకాలలో పులి సంచారం
పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు

ఖానాపురం, ఫిబ్రవరి 22 : పులి ఆనవాళ్లు మళ్లీ కనిపించాయి. వరంగల్‌ జిల్లా ఖానాపు రం మండలంలోని పాకాల అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు వైల్డ్‌లైఫ్‌ ఫొటో గ్రాఫర్లు, అ టవీ శాఖ అధికారులు గుర్తించారు. చిలుక మ్మనగర్‌ శివారు చిలుకలగుట్ట సమీపంలోని గువ్వలబోడు వద్ద పులి పాదముద్రలను కను గొన్నట్లు మంగళవారం వారు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతం నుంచి చిలుకమ్మనగర్‌ వరకు పులి ప్రయాణించి, అక్కడి నుంచి తిరిగి కొత్తగూ డ అడవుల్లోకి వెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో పాకాల అభయారణ్యంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో సమీ ప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, గత రెండు నెలల క్రితం పాకాల సరస్సు చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ప్రయాణికులపై పులి దాడికి యత్నించిన విషయం తెలిసిందే.! ఈ క్రమంలో పులి సంచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.


Updated Date - 2022-02-23T06:08:50+05:30 IST