బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూలు ఇదీ..

ABN , First Publish Date - 2022-06-30T11:06:27+05:30 IST

మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్‌ పట్టణం నుంచి దాదాపు 2

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూలు ఇదీ..

జూలై 1

మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్‌ పట్టణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో పాల్గొని 4 గంటలకు హెచ్‌ఐసీసీ లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ ఉద్యమం-బీజేపీ పోరాటాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నడ్డా ప్రారంభిస్తారు.

రాత్రి 7 గంటలకు నోవాటెల్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశం. జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా, ప్రతిపాదిత తీర్మానాలపై సమీక్ష. 

రాత్రి 8.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.

జూలై 2

ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. 

4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి.

బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.

జూలై 3

ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపు. 

సాయంత్రం 4 గంటలకు మోదీ ముగింపు ఉపన్యాసం. 

4.30 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు పాల్గొంటారు.

జూలై 4

పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం. 

ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బయలుదేరి భీమవరం వెళతారు.

Updated Date - 2022-06-30T11:06:27+05:30 IST