రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. రష్యా-పశ్చిమ దేశాల మధ్య పోరుగా మారింది
ABN , First Publish Date - 2022-03-05T07:29:02+05:30 IST
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇప్పుడు రష్యా, పశ్చిమ
- రష్యాలో భారత మాజీ రాయబారి వెంకటేష్ వర్మ
హైదరాబాద్ సిటీ, మార్చి 4, (ఆంధ్రజ్యోతి): రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇప్పుడు రష్యా, పశ్చిమ దేశాల మధ్య పోరుగా మారిందని రష్యాలోని భారత మాజీ రాయబారి డి.బి. వెంకటేష్ వర్మ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వి ద్యారణ్య స్కూల్‌లో మంతన్ సంస్థ రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చా కార్యక్రమం లో మాట్లాడుతూ... ఈ యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాకుండా... రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం ఆ దేశాన్ని స్విఫ్ట్ వ్యవస్థ నుంచి తొలగించడం, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం వంటి నూతన ధోరణులు కనిపిస్తున్నాయన్నారు. ఫైనాన్స్ వెపనైజేషన్ సిస్టమ్ (ఆర్థిక ఆయుధీకరణ)గా దీన్ని పేర్కొంటున్నారని, దీని పరిణామాలు విశ్వవ్యాప్తంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా యుద్ధంలో భాగంగానే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయని తెలిపారు.