ఎవ్వరూ గుర్తించడం లేదని బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-05T07:11:04+05:30 IST

తనకు ఇంట్లో, బడిలో సరైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో

ఎవ్వరూ గుర్తించడం లేదని బాలిక ఆత్మహత్య

మద్నూర్‌, మార్చి 4: తనకు ఇంట్లో, బడిలో సరైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఓ విద్యార్థిని వాటార్‌ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం పెద్ద ఎక్లారా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు నిజాంసాగర్‌ మండలం మగ్దుంపూర్‌ గ్రామానికి చెందిన 16 ఏళ్ల శిరీష. ఆమె పెద్ద ఎక్లారా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. తెల్లవారుజామునే లేచిన విద్యార్థినులంతా ఉదయం 6:30 గంటలకు స్నానానికి వెళ్లారు. అయితే శిరీష కనిపించకపోవడంతో తోటి విద్యార్థినులు విషయాన్ని ప్రిన్సిపల్‌ సవిత దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి గాలించగా వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  


Updated Date - 2022-03-05T07:11:04+05:30 IST