తుది దశ ‘లా’ సీట్ల కేటాయింపు పూర్తి
ABN , First Publish Date - 2022-12-16T03:13:07+05:30 IST
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : లా సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం తుది దశ సీట్లను కేటాయించారు. మొదటి దశలో మొత్తం 5,747 మందికి లా సీట్లను కేటాయించిన అధికారులు, తుది దశలో 2,836 మందికి కేటాయిం
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : లా సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం తుది దశ సీట్లను కేటాయించారు. మొదటి దశలో మొత్తం 5,747 మందికి లా సీట్లను కేటాయించిన అధికారులు, తుది దశలో 2,836 మందికి కేటాయించారు. ప్రస్తుతం సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.