50వ వసంతంలోకి పౌర హక్కుల సంఘం

ABN , First Publish Date - 2022-12-16T03:34:00+05:30 IST

ఈ నెల 24న గుంటూరులో సభ కవాడిగూడ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్‌సీ) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 24న గుంటూరులో సభను నిర్వహిస్తున్నట్లు పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు తెలిపారు.

50వ వసంతంలోకి పౌర హక్కుల సంఘం

ఈ నెల 24న గుంటూరులో సభ

కవాడిగూడ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్‌సీ) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 24న గుంటూరులో సభను నిర్వహిస్తున్నట్లు పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు తెలిపారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గల ఏపీసీఎల్‌సీ ప్రథమ రాష్ట్ర అధ్యక్షుడు, మహాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద యాబై వసంతాల వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎ్‌ఫఎ్‌సపీఏ, ఉపా, ఎన్‌ఎ్‌సఏ వంటి అప్రజాస్వామిక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీసీఎల్‌సీ నగర అధ్యక్షుడు పీఎం రాజు, కార్యదర్శి శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు రాయల శ్రీధర్‌, విజయ్‌కుమార్‌, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T03:34:01+05:30 IST