బాలుడు కారు డ్రైవింగ్..మూడు వాహనాలు ధ్వంసం
ABN , First Publish Date - 2022-06-23T13:35:39+05:30 IST
ఓ బాలుడు అతివేగంగా కారు నడిపాడు. అదుపుతప్పడంతో సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్క్ చేసిన మూడు కార్లను
హైదరాబాద్/సైదాబాద్: ఓ బాలుడు అతివేగంగా కారు నడిపాడు. అదుపుతప్పడంతో సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్క్ చేసిన మూడు కార్లను ఢీకొట్టాడు. దీంతో అవి ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కార్ల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.