Bandi sanjay పాదయాత్రలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-08-15T18:03:23+05:30 IST
జిల్లాలోని దేవరుప్పులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రికత్త చోటు చేసుకుంది.

జనగామ: జిల్లాలోని దేవరుప్పులలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) పాదయాత్రలో ఉద్రికత్త చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రలో టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు హల్చల్ చేశారు. సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ (BJP) కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటకు దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.