అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-16T03:02:07+05:30 IST
చొప్పదండి/జమ్మికుంట రూరల్, డిసెంబరు15: కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో కౌలురైతు అట్ల కనకయ్య(35)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన కనకయ్య
చొప్పదండి/జమ్మికుంట రూరల్, డిసెంబరు15: కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో కౌలురైతు అట్ల కనకయ్య(35)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన కనకయ్య పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. పంట దెబ్బతినటంతో అప్పులు తీర్చే మార్గం కానరాక బుధవారం పురుగుల మందు తాగాడు. జమ్మికుంట మండలం వావిలాలలో యువ రైతు గొర్ల కొంరయ్య (38) పొలంలో గుంటుక కడుతుండగా గుండె పోటుకు గురై చనిపోయాడు. రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న కొంరయ్యకు గత నాలుగేళ్లుగా దిగుబడి సరిగా రావడం లేదు. ఐదు లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని భార్య రజిత వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలో చేనులో గుంటుక కొట్టేందుకు నాగలికి ఎడ్లు కడుతుండగా, గుండె పోటుతో కుప్ప కూలిపోయాడు.