Hyderabad: మూడు రోజులుగా దేవాలయంలోనే నాగుపాము
ABN , First Publish Date - 2022-10-17T15:53:34+05:30 IST
ఓ నాగుపాము మూడు రోజులుగా కమల్‌నగర్‌లోని ఈదమ్మ తల్లి ఆలయంలోనే ఉంటోంది. స్థానికులైన ఆదిముళ్ల కృష్ణ,
హైదరాబాద్/చాదర్‌ఘాట్: ఓ నాగుపాము మూడు రోజులుగా కమల్‌నగర్‌లోని ఈదమ్మ తల్లి ఆలయంలోనే ఉంటోంది. స్థానికులైన ఆదిముళ్ల కృష్ణ, బెల్లంకుమార్ మూడు రోజుల క్రితం నాగుపామును గుర్తించారు. తిరిగి వెళ్లిపోతుందని భావించారు. కానీ, పాము దేవాలయంలోనే ఉండిపోవడంతో స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలిసి మహిళలు పూజలు చేయడం మొదలు పెట్టారు. కమల్‌నగర్‌తో పాటు, చుట్టుపక్కల బస్తీవాసులు పామును ఆసక్తిగా తిలకిస్తున్నారు.