అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు టాప్‌

ABN , First Publish Date - 2022-01-14T07:50:05+05:30 IST

అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో నిలిచాయి.

అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు టాప్‌

  • 647 చదరపు కిలోమీటర్లతో అగ్రస్థానంలో ఏపీ
  • 632 చదరపు కిలోమీటర్లతో రెండో స్థానంలో తెలంగాణ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో నిలిచాయి. 647 చదరపు కిలోమీటర్లతో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థా నం సొంతం చేసుకోగా.. 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ గురువారం ఢిల్లీలో విడుదల చేసిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(ఐఎస్‌ఎఫ్‌) 2021 నివేదిక ఈ అంశా న్ని వెల్లడించింది. 2019తో పోలిస్తే గత రెండేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 2.22T అట వీ విస్తీర్ణం పెరిగింది. తెలంగాణలో 2019 నివేదికతో పోలిస్తే 3.07% అటవీ విస్తీర్ణం పెరిగిందని, ఇది దేశంలో రెండో స్థానమని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా గత రెండేళ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని ఐఎ్‌సఎఫ్‌ నివేదిక తెలిపింది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కి.మీ కాగా.. అందులో అటవీ విస్తీర్ణం 21,214 చదరపు కి.మీ. అని, ఇది రాష్ట్ర భూభాగంలో 18.93% అని వివరించింది. అందులో అత్యంత దట్టమైన అడవుల విస్తీర్ణం 1,624 చదరపు కి.మీ ఉండగా.. మధ్యస్థ దట్టమైన అడవులు 9,119 చదరపు కి.మీ. మైదాన ప్రాంత అడవుల విస్తీర్ణం 10,471 చదరపు కి.మీ. ఉన్నాయని తెలిపింది. అలాగే రాష్ట్రంలో 25,800 చదరపు కిలోమీటర్ల మేర రిజర్వు ఫారెస్టు, 1,592 చదరపు కి.మీ రక్షిత అడవులు, 296 చదరపు కి.మీ వర్గీకరించని అడవులున్నాయి. 


హైదరాబాద్‌లో 147% పెరుగుదల

అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు లాంటి మెగా సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. పదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో అడవులు పెరిగాయి. 2011 నివేదికతో పోలిస్తే 147ు అటవీ విస్తీర్ణం పెరిగిందని నివేదిక తెలిపింది. 2011లో 33.15 చదరపు కి.మీ విస్తీర్ణం ఉండగా.. 2021 నాటికి అది 81.81 చదరపు కి.మీకి పెరిగింది. హైదరాబాద్‌ భౌగోళిక విస్తీర్ణంలో 12.9% అడవులు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలవారీగా అట వీ విస్తీర్ణం వివరాలను చూస్తే కరీంనగర్‌లో అత్యధికంగా 217.81 చదరపు కి.మీ విస్తీర్ణం మేర అడవులు పెరిగాయి. ఆ తర్వాత స్థానంలో వరంగల్‌ (145.62 చదరపు కిమీ), నల్లగొండ (103.75 చదరపు కి.మీ) ఉన్నాయి. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 5,743.42 చదరపు కి.మీ (35.66 శాతం) అటవీ విస్తీర్ణం ఉంది. 

Updated Date - 2022-01-14T07:50:05+05:30 IST