రేవంత్‌రెడ్డి బయటకు వస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు: సీతక్క
ABN , First Publish Date - 2022-03-21T03:14:57+05:30 IST
తెలంగాణలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు..
ఎల్లారెడ్డి: తెలంగాణలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టుబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌లో పేదల భూములను మాయం చేశారన్నారు. ప్రతిగింజా కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఉరి అంటున్నారని చెప్పారు. పేదల కోసం 100 రోజుల పని తెచ్చింది, పొడు భూములకు పట్టాలిచింది సోనియమ్మ అని సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డి బయటకు వస్తే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మద్యం షాపులు జనాభా ప్రాతిపదికన ఎవరైనా వైన్స్ షాపులు ఇస్తారా అని, కేసీఆర్ ఇవ్వడం సిగ్గుచేటని సీతక్క విమర్శించారు.