శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-10-08T01:04:19+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.3కోట్లకు పైగా విలువైన బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.57కోట్ల విలువైన 4,895 గ్రాముల బంగారం సీజ్ చేసిన అధికారులు మరో కేసులో రూ.1.47కోట్ల విలువైన 2800 గ్రామల 24 బంగారం కడ్డీలు సీజ్ చేశారు.