సికింద్రాబాద్... అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి... మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ABN , First Publish Date - 2022-09-13T14:23:19+05:30 IST

సికింద్రాబాద్... అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి... మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్... అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి... మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్‌: రూబీ హోటల్‌ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 

కాగా  రూబీ హోటల్‌ సెల్లార్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 8 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ-స్కూటర్‌ షోరూమ్‌లోని బ్యాటరీలు పేలడంతో ఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూబీ హోటల్ భవనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 

Read more