కేసీఆర్‌తో వాళ్ళు కలవరు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-11T21:28:21+05:30 IST

కేసీఆర్‌తో వాళ్ళు కలవరు: రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌తో వాళ్ళు కలవరు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కుమారస్వామి పార్టీని విలీనం చేస్తారా? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఏక్‌నాథ్‌షిండేలను కేసీఆర్ కలవరన్నారు. కాంగ్రెస్‌తో ఉన్నవారినే కలవడంలో అంతర్యమేంటి? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

Read more