పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడి

ABN , First Publish Date - 2022-06-26T23:43:51+05:30 IST

పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడి

పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడి

భద్రాద్రి: పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడికి పాల్పడ్డారు. చండ్రుగొండ మండలం ఏర్రబోడులో ఆదివాసీ మహిళా రైతులను బెల్టులు, కర్రలతో మహిళలను అటవీశాఖ సిబ్బంది కొట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు. కాళ్లుచేతులు, వీపులపై వాతలు తెలేలా అటవీశాఖ సిబ్బంది దాడి చేశారని వాపోతున్నారు. చంటి పిల్లల తల్లులపై ప్రతాపం చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల్లో ట్రెంచ్ కొట్టడానికి అడ్డువచ్చిన పోడు రైతులను ఉరికించి మహిళలపైన దాడి చేశారని చెబుతున్నారు. ఫారెస్ట్ సిబ్బంది పాశవిక దాడిపై ఆదివాసీ గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. 


Updated Date - 2022-06-26T23:43:51+05:30 IST