నల్లగొండ జిల్లా... సర్పంచ్ దారుణ హత్య
ABN , First Publish Date - 2022-08-14T00:29:11+05:30 IST
నల్లగొండ జిల్లా... సర్పంచ్ దారుణ హత్య

నల్లగొండ: జిల్లాలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో దారుణ హత్య చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త విజయ్రెడ్డిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.