టీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

ABN , First Publish Date - 2022-08-15T22:58:10+05:30 IST

టీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

టీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

హైదరాబాద్: చేతకాని టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్‌పై దాడి చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఫాల్తూ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకరరావు దేనికీ పనికిరాడని విమర్శించారు. బండి సంజయ్‌పై దాడులతో కుట్ర చేస్తే ఆయన అగుతారా? అని ప్రశ్నించారు. పోలీసులకు తెలిసే దాడి జరిగిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందో పోలీసులు ఆలోచించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇదే పని చేస్తే మీ ఎమ్మెల్యేలు తిరగగలరా? అని ఆయన ప్రశ్నించారు. 

Read more