ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరం: దుశ్యంత్‌ దవే

ABN , First Publish Date - 2022-11-30T16:42:37+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరమైన కేసని ప్రభుత్వ తరపు లాయర్‌ దుశ్యంత్‌ దవే పేర్కొన్నారు. బీజేపీకి సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరం: దుశ్యంత్‌ దవే

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరమైన కేసని ప్రభుత్వ తరపు లాయర్‌ దుశ్యంత్‌ దవే పేర్కొన్నారు. బీజేపీకి సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలన్నారు. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరుపున పిటిషన్‌ వేస్తారని, దేశంలో అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి విమానాల్లో తీసుకెళ్లి ప్రభుత్వాలు పడగొట్టారని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదైన మరుక్షణం నుంచి.. కేసును వీక్‌ చేసే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రం కుట్ర అన్నారు. లాయర్‌ దుశ్యంత్‌ దవే వాదనలను బీజేపీ న్యాయవాది అడ్డుకున్నారు.

Updated Date - 2022-11-30T16:42:37+05:30 IST

Read more