విషాదం... ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-18T01:19:31+05:30 IST
విషాదం... ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
మంచిర్యాల: జిల్లాలోని లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు చెన్నల ధనలక్ష్మి(23), సమాన్విత(6), సంకరమ్మ(6 నెలలు)గా గుర్తించారు. కుటుంబీకుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.