మునుగోడు చేనేత కార్మికులతో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-17T23:02:10+05:30 IST

మునుగోడు చేనేత కార్మికులతో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మునుగోడు చేనేత కార్మికులతో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి చేనేత కార్మికులు బుద్ధి చెప్పారా మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత వస్త్రాలపై పన్నువేసిన తొలి భారత ప్రధాని మోడీ అని మండిపడ్డారు. మునుగోడు చేనేత కార్మికులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది బీజేపీనే అని మండిపడ్డారు. చేనేత కార్మికుల పొదుపు పథకం, భీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది ప్రధాన మంత్రి మోడీనే అన్నారు. నేతన్నల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నది భారతీయ జనతా పార్టీ అని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని చేనేత కార్మికులను కేటీఆర్ కోరారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా బడ్జెట్ ఇచ్చి నేతన్నలను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-17T23:02:10+05:30 IST