‘హైదరాబాద్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఫైనల్స్ నిర్వహిస్తాం’
ABN , First Publish Date - 2022-12-07T17:05:40+05:30 IST
ఈ నెల 10, 11న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిల్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఈ నెల 10, 11న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిల్ రెడ్డి తెలిపారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మొత్తం 4 సెషన్స్ ఉన్నాయన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కార్ రేసింగ్ ఉంటుందన్నారు. 12 కార్లు, 24 రేజర్లు ఫైనల్స్‌లో పాల్గొంటారని వెల్లడించారు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హుస్సేన్‌సాగర్ తీరానపై ప్రత్యేకంగా వేసిన ట్రాక్ రేసింగ్‌కు అనుకూలంగా ఉందన్నారు. 6 వేల మంది సందర్శకులు చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఫైనల్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు.