గ్రూప్ 1 పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2022-10-18T00:45:16+05:30 IST
గ్రూప్ 1 పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
హైదరాబాద్: గ్రూప్ 1 పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ వన్ పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్‌కు షాట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఆధారంగా 1:50 మధ్య అభ్యర్థులను షార్ట్ లిస్ట్ జరుగుతుందని తెలిపింది. జోన్లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని పేర్కొంది. ఖాళీలను బట్టి ఒక్కో క్యాటగిరిలో ఒక్కో పోస్టుకు 1: 50 చొప్పున మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తామని అధికారులు ప్రకటించారు.