‘జగన్ కుటుంబంలోకి ఉడుములా చొరబడ్డాడు’

ABN , First Publish Date - 2022-10-01T23:44:46+05:30 IST

‘జగన్ కుటుంబంలోకి ఉడుములా చొరబడ్డాడు’

‘జగన్ కుటుంబంలోకి ఉడుములా చొరబడ్డాడు’

కరీంనగర్‌: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్‌ అయ్యారు. హరీష్‌రావును విమర్శించే స్థాయి సజ్జలకు లేదన్నారు. జగన్ కుటుంబంలోకి ఉడుములా చొరబడ్డావని సజ్జలను విమర్శించారు. తల్లిని, చెల్లిని విడదీసావని ఆరోపించారు. ఏపీలో మీ పాలన చక్కగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి బీ టీమ్‌లా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. సజ్జల, అమర్‌నాథ్‌కి అంత సీన్‌ లేదని, తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఏపీ గడ్డపై కచ్చితంగా అడుగు పెడతామన్నారు. 

Read more