హైదరాబాద్ పబ్‌లకు సీపీ ఆదేశాలు ఇవే

ABN , First Publish Date - 2022-09-24T22:09:37+05:30 IST

హైదరాబాద్ పబ్‌లకు సీపీ ఆదేశాలు ఇవే

హైదరాబాద్ పబ్‌లకు సీపీ ఆదేశాలు ఇవే

హైదరాబాద్‌: నగరంలోని పబ్‌లపై సైబరాబాద్‌ సీపీ సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలోని పబ్‌ల యాజమాన్యంతో సైబరాబాద్ సీపీ భేటీ అయ్యారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని పబ్ యజమానులకు ఆదేశించారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించొద్దని సీపీ అదేశించారు. సీసీ కెమెరాలకు బ్యాకప్ ఉండేలా చూసుకోవాలని పబ్ యజమానులకు సీపీ సూచించారు. అలాగే పబ్ సిబ్బంది, కస్టమర్లను పరిశీలించడానికి బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగరంలో పబ్బుల నిర్వహణ బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే శబ్ధ కాలుష్యం, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బంది లేకుండా పబ్బులు నిర్వహించుకోవాలని సైబరాబాద్‌ సీపీ తెలిపారు. 

Read more