మునుగోడు ఉపఎన్నిక.. ఢిల్లీ నుంచే కేసీఆర్ సమీక్ష.. ఎందుకంటే..?
ABN , First Publish Date - 2022-10-17T22:28:21+05:30 IST
మునుగోడు ఉపఎన్నిక.. ఢిల్లీ నుంచే కేసీఆర్ సమీక్ష.. ఎందుకంటే..?
ఢిల్లీ: సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. జ్వరం కారణంగా 2 రోజులుగా ఎవరినీ కలవని సీఎం కలవలేదు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, కవిత మకాం వేశారు. అంతేగాక మునుగోడు ఉపఎన్నికపై ఢిల్లీ నుంచే ఆయన సమీక్షిస్తున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకు టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ కూడా గెలుపై దృష్టి సారించింది. అలాగే ఈ ఉపఎన్నికకు డబ్బు విచ్చలవిడిగా ఆయా పార్టీలు ఖర్చుచేస్తున్నట్లు కూడా సమాచారం.