టీఆర్‌ఎస్ గూండాలు రాజ్యమేలుతున్నారు: అనురాగ్‌ ఠాకూర్‌

ABN , First Publish Date - 2022-07-02T20:46:44+05:30 IST

టీఆర్‌ఎస్ గూండాలు రాజ్యమేలుతున్నారు: అనురాగ్‌ ఠాకూర్‌

టీఆర్‌ఎస్ గూండాలు రాజ్యమేలుతున్నారు: అనురాగ్‌ ఠాకూర్‌

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్ గూండాలు రాజ్యమేలుతున్నారని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్‌ ఆలోచన వెనుక ఉన్న శక్తి ఏమిటో ఆయనే చెప్పాలన్నారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. తెలంగాణ అప్పులను ప్రస్తావించిన మంత్రి అనురాగ్‌.. ఏపీ అప్పులపై కూడా సమాధానం దాట వేయడం గమనార్హం. Updated Date - 2022-07-02T20:46:44+05:30 IST