కొవిడ్‌ టీకాలపై పరిశోధనలు జరగాలి

ABN , First Publish Date - 2022-09-11T09:04:48+05:30 IST

కొవిడ్‌ టీకాలపై పరిశోధనలు జరగాలి

కొవిడ్‌ టీకాలపై పరిశోధనలు జరగాలి

క్యూ వైవ్‌ సదస్సులో వైద్యుల స్పష్టీకరణ


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 టీకాను రూపొందించిన ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనకా, జాన్సన్‌, సినోవాక్‌, స్పుత్నిక్‌-విలకు సంబంధించి ప్రభావాలపై మరిన్ని పరిశోఽధనలు జరగాలని 34 దేశాలకు చెందిన వైద్యులు తాజాగా అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయ వైద్య సంక్షోభం-కొవిడ్‌’ అంశంపై తాజాగా నగరంలో జరిగిన క్యూ వైవ్‌ స దస్సులో వారంతా ఆన్‌లైన్‌లో శనివారం పాల్గొన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారిలో దాదాపు 70 వేల మంది చనిపోయారు. కొవిడ్‌ టీకాల దుష్ప్రభావాలగురించి, గుండె సంబంధిత వ్యాధుల పెరుగుదల వంటి వాటి గురించి  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముంది’’ అని వైద్యులు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-09-11T09:04:48+05:30 IST