పత్తికొండ మార్కెట్లో టమోటా రైతుల కష్టాలు
ABN , First Publish Date - 2022-08-14T15:30:08+05:30 IST
పత్తికొండ మార్కెట్లో టమోటా రైతుల కష్టాలు

కర్నూలు: జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో టమోటా రైతులు కష్టాలకు గురవుతున్నారు. కిలో రూ. 5 కూడా టమోటా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక టమోటను పారబోసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతుల ఆవేదన పడుతున్నారు. ప్రభుత్వమే టమోటాను ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.