బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదల... ఆ సినిమా ఏంటంటే...?

ABN , First Publish Date - 2022-10-07T21:33:01+05:30 IST

హైదరాబాద్‌ నిజాం చరిత్ర నేపథ్యంలో సినిమా తెరపైకి తీసుకురానున్నట్లు తెలిసింది. సినిమా పేరును రజాక‌ర్స్‌గా నిర్ణయించినట్లు స‌మాచారం.

బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదల... ఆ సినిమా ఏంటంటే...?

హైదరాబాద్‌ నిజాం చరిత్ర నేపథ్యంలో సినిమా తెరపైకి తీసుకురానున్నట్లు తెలిసింది. సినిమా పేరును రజాక‌ర్స్‌గా నిర్ణయించినట్లు స‌మాచారం. బీజేపీ నేత గూడురు నారాయ‌ణరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే సెట్స్‌పైకి మూవీ వెళ్లినట్లు సినీ వర్గాలు అనుకుంటున్నారు. అమిత్‌షా సూచనలతో సినిమా నిర్మాణం పూర్తవుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయని తెలిసింది. బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదలకు ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. సినిమా విషయాలను చిత్రయూనిట్ గోప్యంగా ఉంచుతున్నట్లు కొందరు నేతలు చెప్పుకుంటున్నట్లు వినికిడి.  ఇదిలా వుండగా రజాకర్స్ ఫైల్స్ పేరుతో మరో సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ రెడీ చేస్తున్నట్లు తెలిసింది. సాధారణ ఎన్నికల నాటికి రెండు సినిమాల విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనాసరే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఓపికపట్టాల్సిందే. 

Read more