కేసీఆర్ మౌనానికి కారణం ఏమిటి?... బండి సంజయ్ కీలక వాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-07T22:27:16+05:30 IST

కేసీఆర్ మౌనానికి కారణం ఏమిటి?... బండి సంజయ్ కీలక వాఖ్యలు

కేసీఆర్ మౌనానికి కారణం ఏమిటి?... బండి సంజయ్ కీలక వాఖ్యలు

వరంగల్: టీఆర్ఎస్‌పై రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్‌లు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ఆయన స్పందించారు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే స్కామ్‌ను ఒప్పుకున్నట్లేనన్నారు. మునుగోడులో ఒక్కొక్కరికి రూ.40 వేలు పంచడానికి టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు. వారికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్నారు. 

Read more