మూడేళ్లలో మరింత బలం.. కారు కాదు ఫైర్: కేటీఆర్

ABN , First Publish Date - 2022-04-26T02:48:01+05:30 IST

రెండు జాతీయ పార్టీలు కలిసి పని చేస్తే తప్ప.. తమను ఎదుర్కోలేనంత దీటైన శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని..

మూడేళ్లలో మరింత బలం.. కారు కాదు ఫైర్: కేటీఆర్

హైదరాబాద్: రెండు జాతీయ పార్టీలు కలిసి పని చేస్తే తప్ప.. తమను ఎదుర్కోలేనంత దీటైన శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్, నాగార్జునసాగర్ అసెంబ్లీ, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని టీఆర్ఎస్‌తో తలపడ్డాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో టీఆర్ఎస్ పార్టీ మరింత ధృడంగా తయారయిందని చెప్పారు. ప్రజల ఆంక్షలు తెలుసుకుంటూ భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తిరుగులేని నాయకుడని, తంబాకులు నమిలే వ్యక్తులు దూషిస్తున్నా సంయమనం పాటిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
Updated Date - 2022-04-26T02:48:01+05:30 IST