TS News: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం: లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-08-18T22:36:19+05:30 IST

తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమని ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ధీమా వ్యక్తం చేశారు.

TS News: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం: లక్ష్మణ్

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమని ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్ షా సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు చోటు దక్కడం.. సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవమన్నారు. ప్రజలు కోరుకున్నందునే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని తెలిపారు. భవిష్యత్ లేకనే కేంద్రం, ప్రధానిపై సీఎం కేసీఆర్ (CM KCR) విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉపఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ కాడి పడేసిందని ఎద్దేవాచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు మునుగోడు ఉపఎన్నికలో పునరావృతం అవుతాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

Updated Date - 2022-08-18T22:36:19+05:30 IST